ఐడీఎఫ్‌సీ ఇన్‌ఫ్రా ఫండ్‌కు అనుమతి | Sakshi
Sakshi News home page

ఐడీఎఫ్‌సీ ఇన్‌ఫ్రా ఫండ్‌కు అనుమతి

Published Fri, Dec 13 2013 3:45 AM

CCEA allows IDFC to set up Infrastructure fund with Rs 5,500 corpus

న్యూఢిల్లీ: ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటు చేయడానికి ఐడీఎఫ్‌సీకి ప్రభుత్వం బుధవారం అనుమతినిచ్చింది. రూ.5,500 కోట్ల కార్పస్‌తో ఐడీఎఫ్‌సీ ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటి అనుమతిచ్చింది. అల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(ఏఐఎఫ్) కేటగిరి వన్‌గా ఈ ఫండ్ సెబీ వద్ద నమోదవుతుంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి ఈ ఫండ్ రూ.5,500 కోట్ల వరకూ నిధులు సమీకరించుకోవచ్చు. ఇలా సేకరించిన నిధులను ఇంధన, రవాణా, విమానయానం, టెలికాం మౌలిక సదుపాయాలు, ఇతర పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల కోసం వినియోగిస్తారు.

Advertisement
Advertisement