breaking news
India Infrastructure Fund
-
మౌలిక రంగం నత్తనడక
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమలతో కూడిన మౌలికరంగం ఫిబ్రవరిలో మందగమనంలో ఉంది. వృద్ధి కేవలం 2.1 శాతంగా నమోదయ్యింది. క్రూడ్ ఆయిల్, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తిలో బలహీన ధోరణి దీనికి కారణం. 2018 ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.4 శాతం. సోమవారం విడుదలైన వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం... ►క్రూడ్ ఆయిల్, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా వరుసగా –6.1 శాతం, –0.8 శాతం చొప్పున క్షీణించాయి. ►ఎరువులు (5.2 శాతం నుంచి 2.5 శాతం), స్టీల్ (5 శాతం నుంచి 4.9 శాతం), సిమెంట్ (23 శాతం నుంచి 8 శాతం) విద్యుత్ (4.6 శాతం నుంచి 0.7 శాతం) రంగాల ఉత్పత్తుల్లో వృద్ధి ఉన్నప్పటికీ ఈ రేటు తగ్గింది. ►అయితే బొగ్గు, సహజ వాయువుల రంగాల్లో మాత్రం వృద్ధి 7.3 శాతం, 3.8 శాతం చొప్పున నమోదయ్యాయి. ►కాగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి నెలల్లో చూస్తే, మౌలిక రంగం వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదయ్యింది. -
ఐడీఎఫ్సీ ఇన్ఫ్రా ఫండ్‌కు అనుమతి
న్యూఢిల్లీ: ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటు చేయడానికి ఐడీఎఫ్సీకి ప్రభుత్వం బుధవారం అనుమతినిచ్చింది. రూ.5,500 కోట్ల కార్పస్‌తో ఐడీఎఫ్సీ ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటి అనుమతిచ్చింది. అల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఏఐఎఫ్) కేటగిరి వన్‌గా ఈ ఫండ్ సెబీ వద్ద నమోదవుతుంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి ఈ ఫండ్ రూ.5,500 కోట్ల వరకూ నిధులు సమీకరించుకోవచ్చు. ఇలా సేకరించిన నిధులను ఇంధన, రవాణా, విమానయానం, టెలికాం మౌలిక సదుపాయాలు, ఇతర పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల కోసం వినియోగిస్తారు.