వారం రోజుల గరిష్టానికి సూచీలు | BSE Sensex gains around 280 points; IT stocks gain | Sakshi
Sakshi News home page

వారం రోజుల గరిష్టానికి సూచీలు

Aug 14 2013 2:06 AM | Updated on Sep 1 2017 9:49 PM

ఆసియా మార్కెట్ల జోరు కొనసాగడంతో వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ సూచీలు ర్యాలీ జరిపాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 19, 230 పాయింట్ల వద్ద ముగిసింది.

 ఆసియా మార్కెట్ల జోరు కొనసాగడంతో వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ సూచీలు ర్యాలీ జరిపాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్ 19, 230 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 283 పాయింట్ల భారీ లాభాన్ని ఆర్జించింది. మూడురోజుల్లో సూచీ 500 పాయింట్ల మేర ర్యాలీ జరిపింది. 5,600 సమీపంలో మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 87 పాయింట్ల పెరుగుదలతో 5,699 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. రూపాయి క్షీణత నేపథ్యంలో ఐటీ, ఫార్మా షేర్లలో భారీ కొనుగోళ్లు జరిగాయి. సూచీల్లో 8 శాతంపైగా వెయిటేజీ వున్న ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 2.6 శాతం ర్యాలీ జరిపి 52 వారాల గరిష్టస్థాయి వద్ద ముగిసింది. విప్రో కూడా 3 శాతం పెరుగుదలతో 52 వారాల గరిష్టస్థాయి వద్ద ముగియగా, టెక్ మహీంద్రా 5 శాతం ర్యాలీ జరిపి ఐదేళ్ల గరిష్టస్థాయి వద్ద క్లోజయ్యింది. రియల్టీ, బ్యాంకింగ్ షేర్లకూ కొనుగోలు మద్దతు లభించింది.
 
 నిఫ్టీ కాంట్రాక్టుల్లో షార్ట్ కవరింగ్...
 ఇటీవలి ర్యాలీ నేపథ్యంలో నిఫ్టీ ఫ్యూచర్, కాల్ ఆప్షన్ కాంట్రాక్టుల్లో భారీగా షార్ట్ కవరింగ్ జరిగింది. నిఫ్టీ ఆగస్టు ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి ఒక్కసారిగా 8.48 లక్షల షేర్లు (5.5 శాతం) కట్ అయ్యాయి. దాంతో ఓఐ 1.38 కోట్లకు తగ్గింది. అలాగే 5,500, 5,600 స్ట్రయిక్స్ వద్ద పెద్ద ఎత్తున కాల్ కవరింగ్ జరిగింది. ఈ కాల్ ఆప్షన్స్ నుంచి వరుసగా 8.33 లక్షలు, 5.27 లక్షల చొప్పున షేర్లు కట్ అయ్యాయి. 5,700 స్ట్రయిక్ వద్ద మాత్రం స్వల్పంగా కాల్ రైటింగ్ జరగడంతో 1.80 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. అదే సమయంలో 5,500, 5,600, 5,700 స్ట్రయిక్స్ వద్ద భారీగా పుట్ రైటింగ్ జరిగింది. ఈ పుట్ ఆప్షన్లలో వరుసగా 4.63 లక్షలు, 12.78 లక్షలు, 6.31 లక్షల షేర్ల చొప్పున పుట్ బిల్డప్ జరిగింది. సమీప భవిష్యత్తులో సూచీ ఫలానా స్థాయి దిగువకు తగ్గదన్న అంచనాలతో ఇన్వెస్టర్లు పుట్ ఆప్షన్లను విక్రయించడంవల్ల ఈ తరహా పుట్ బిల్డప్ జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement