షోమా చౌదరి ఇంటి ముందు బీజేపీ ఆందోళన | BJP workers protest outside Shoma Chaudhury's house | Sakshi
Sakshi News home page

షోమా చౌదరి ఇంటి ముందు బీజేపీ ఆందోళన

Nov 28 2013 3:51 PM | Updated on Sep 2 2017 1:04 AM

షోమా చౌదరి ఇంటి ముందు బీజేపీ ఆందోళన

షోమా చౌదరి ఇంటి ముందు బీజేపీ ఆందోళన

తెహల్కా మేనేజింగ్ మాజీ ఎడిటర్ షోమా చౌదరి ఇంటి ముందు గురువారం బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

ఢిల్లీ: తెహల్కా మేనేజింగ్ మాజీ ఎడిటర్ షోమా చౌదరి ఇంటి ముందు గురువారం బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను షోమా చౌదరి కాపాడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఆమె ఇంటి ముందు ధర్నా చేపట్టింది.  ఆమె మహిళ అయ్యి కూడా సాటి మహిళలకు అండగా నిలవకపోవడం చాలా బాధాకరమని ఆందోళనలో పాల్గొన్నబీజేపీ నేత విజయ్ జోలీ తెలిపారు. ఇది యావత్తు మహిళా లోకమే తలదించుకునేలా ఉందని జోలీ తెలిపారు.  తేజ్ పాల్ కు అండగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె తెహల్కా మేనేజింగ్ ఎడిటర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు తరుణ్ తేజ్పాల్ను అరెస్ట్ చేసేందుకు గోవా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం తేజ్ పాల్ విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆయనకు గోవా పోలీసులు సమన్లు పంపారు.   దాంతో విచారణ అనంతరం తేజ్‌పాల్‌ను అరెస్ట్ చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement