బీజేపీపై సిద్దూ రివర్స్‌ పంచ్ | BJP full off currepted leaders, CM Siddaramaiah slams | Sakshi
Sakshi News home page

బీజేపీపై సిద్దూ రివర్స్‌ పంచ్

May 7 2017 5:47 PM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీపై సిద్దూ రివర్స్‌ పంచ్ - Sakshi

బీజేపీపై సిద్దూ రివర్స్‌ పంచ్

బీజేపీ అంటేనే అవినీతిపరుల పార్టీ అని, పదవుల్లో ఉండగా జైలుకు వెళ్ళిన వారు, మున్ముందు వెళ్లబోయేవారు తప్ప ఆ పార్టీలో మరెవ్వరూ లేరని విమర్శించారు.

బెంగళూరు : ప్రతిపక్ష బీజేపీ తనపై సంధిస్తోన్న అవినీతి ఆరోపణలకు రివర్స్‌ పంచ్‌ విసిరారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. బీజేపీ అంటేనే అవినీతిపరుల పార్టీ అని, పదవుల్లో ఉండగా జైలుకు వెళ్ళిన వారు, మున్ముందు వెళ్లబోయేవారు తప్ప ఆ పార్టీలో మరెవ్వరూ లేరని విమర్శించారు.

ఆదివారం హుబ్బలి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీనే అదికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తారు. కర్ణాటకలో తీవ్రమైన కరువు ఉన్నదని తెలిసి కూడా కేంధ్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, ఎన్డీఏ సర్కారు కర్ణాటకపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదని ఆరోపించారు. మహాదాయి నీటి విషయంలో గోవా పప్రభుత్వంపై మరోసారి చర్చలు జరుపుతానని సీఎం సిద్ధరామయ్య చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement