యువరాజ్‌సింగ్‌ తల్లిపై ఆమె తీవ్ర ఆరోపణలు..! | Bigg Boss contestant allegations on Yuvraj Singh mother | Sakshi
Sakshi News home page

యువరాజ్‌సింగ్‌ తల్లిపై ఆమె తీవ్ర ఆరోపణలు..!

Oct 18 2016 4:48 PM | Updated on Sep 4 2017 5:36 PM

యువరాజ్‌సింగ్‌ తల్లిపై ఆమె తీవ్ర ఆరోపణలు..!

యువరాజ్‌సింగ్‌ తల్లిపై ఆమె తీవ్ర ఆరోపణలు..!

గుర్గావ్‌కు చెందిన 25 ఏళ్ల ఆకాంక్ష శర్మ గురించి నిన్నటివరకు పెద్దగా ఎవరికీ తెలియదు.

గుర్గావ్‌కు చెందిన 25 ఏళ్ల ఆకాంక్ష శర్మ గురించి నిన్నటివరకు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఆదివారం రాత్రి ప్రసారమైన బిగ్‌బాస్‌ టీవీషోలో ఆమె పలు విస్మయకర విషయాలు తెలిపారు. తాను గతంలో క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తమ్ముడు జోరావర్‌ సింగ్‌ను పెళ్లి చేసుకున్నట్టు ఆమె  వెల్లడించారు. తమ పెళ్లి కేవలం నాలుగు నెలలకే విచ్ఛిన్నమైందని, దీంతో అత్తవారింటి నుంచి తాను తిరిగొచ్చినట్టు తెలిపారు. యువరాజ్‌సింగ్‌ తల్లి, తన అత్త అయిన షబ్నంసింగ్‌యే తమ పెళ్లి పెటాకులు కావడానికి కారణమని, ఆమె కారణంగానే తాను భర్త నుంచి విడిపోయినట్టు తీవ్ర ఆరోపణలు చేశారు. బిగ్‌బాస్‌ షో పోటీదారు అయిన ఆమె అంతకుమించి వివరాలు వెల్లడించలేదు.

ఈ నేపథ్యంలో యూవీ తల్లి షబ్నంసింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆకాంక్ష శర్మ ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రస్తుతం ఆమె పెళ్లి విషయం కోర్టు పరిధిలో ఉందని, కాబట్టి ఆ వివరాలు తాను వెల్లడించలేనని చెప్పారు. భర్తతో విడిపోయి రెండున్నరేళ్లు గడచిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఆకాంక్ష శర్మ ఆరోపణలు చేస్తున్నదని ఆమె ప్రశ్నించారు. ‘ఇది గతంలోనే ఆమె చేసి ఉండాల్సింది. కానీ చేయలేదు. ఇప్పుడు వేదిక (బిగ్‌బాస్‌ షో) దొరికినందుకు ఆమె ఇవన్నీ విషయాలు చెప్తోంది’ అని షబ్నం సింగ్‌ అన్నారు. వారి వైవాహిక బంధం విడిపోవడానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సి వస్తుందని తనకు తెలుసునని, అది తానే అని నిందించినా పర్వాలేదని, కానీ ఆమెకు దేవుడి ఆశీస్సులు ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని చెప్పారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement