సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీరేట్లు తగ్గింపు? | Banks looking for lower savings account interest rates | Sakshi
Sakshi News home page

సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీరేట్లు తగ్గింపు?

Mar 28 2017 7:14 PM | Updated on Sep 5 2017 7:20 AM

సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీరేట్లు తగ్గింపు?

సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీరేట్లు తగ్గింపు?

సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ కు బ్యాంకులు షాకివ్వనున్నాయి.

ముంబై : సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ కు బ్యాంకులు షాకివ్వనున్నాయి. రుణాల వృద్ధి తగ్గిపోవడంతో సేవింగ్స్ అకౌంట్లపై ఇచ్చే వడ్డీరేట్లను తగ్గించేందుకు బ్యాంకులు ప్లాన్స్ వేస్తున్నాయి. వడ్డీరేట్లు తగ్గించి తమ  ప్రీ ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్లను(నిర్దేశించిన కాలవ్యవధిలో ఆర్జించే ఆదాయాలు) పెంచుకోవాలని బ్యాంకులు యోచిస్తున్నట్టు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ జేఫ్ఫెరీస్ చెప్పింది. ప్రస్తుతం చాలా బ్యాంకులు 4 శాతం వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి.
 
కొన్ని ప్రైవేట్ దిగ్గజ బ్యాంకులు అధిక రేటుని అందిస్తున్నాయని జేఫ్ఫెరీస్ పేర్కొంది. జేఫ్ఫెరీస్ రిపోర్టు ప్రకారం 50 బేసిస్ పాయింట్లు సేవింగ్స్ రేట్లపై బ్యాంకులు తగ్గిస్తాయని, దీంతో ప్రీ ప్రొవిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్లను 8 శాతం మెరుగుపరుచుకోనున్నాయని తెలిపింది.  రుణాల వృద్ధి తగ్గడం నికర వడ్డీరేట్ల మార్జిన్లకు మంచిది కాదని పేర్కొంది. సెక్టార్ విలువను చాలా మంది ఇన్వెస్టర్లు గమనిస్తుంటారని, బలహీనమైన రాబడుల వృద్ధి సెక్టార్పై ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని రిపోర్టు నివేదించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement