పాపులర్ గేమ్ షో లవర్స్ కి శుభవార్త! | Amitabh Bachchan has just confirmed the fresh season of Kaun Banega Crorepati! | Sakshi
Sakshi News home page

పాపులర్ గేమ్ షో లవర్స్ కి శుభవార్త!

Dec 10 2016 2:48 PM | Updated on Sep 4 2017 10:23 PM

పాపులర్ గేమ్ షో లవర్స్ కి శుభవార్త!

పాపులర్ గేమ్ షో లవర్స్ కి శుభవార్త!

పాపులర్ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి ' లవర్స్ కు శుభవార్త. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ యాంకరింగ్ స్టయిల్ తో అత్యంత ప్రజాదరణ పొందిన 'కౌన్ బనేగా కరోడ్ పతి ' మళ్లీ వస్తోంది.

ముంబై: పాపులర్ గేమ్ షో 'కౌన్ బనేగా  కరోడ్ పతి'   లవర్స్ కు శుభవార్త.  బాలీవుడ్ సూపర్ స్టార్  అమితాబ్ బచ్చన్  యాంకరింగ్  స్టయిల్ తో అత్యంత  ప్రజాదరణ పొందిన 'కౌన్ బనేగా  కరోడ్ పతి ' మళ్లీ వస్తోంది.  అవును ఈ విషయాన్నిస్ వయంగా  బిగ్ బీనే సోషల్ మీడియా లైవ్ చాట్  లో కన్ ఫాం చేశారు.  

బుల్లితెరపై అభిమానులను ఉర్రూతలూగించిన ఈ మేజిక్ ఇండియన్ మెగాస్టార్ అమితాబ్  బచ్చన్ మళ్లీ టెలివిజన్లో కనువిందు చేయడానికి రడీ అవుతున్నారు.    వచ్చే ఏడాదిలో  కౌన్ బనేగా  కరోడ్ పతి  గేమ్   కొత్త సీజన్  తిరిగి ప్రారంభం కానున్నట్టు ఫేస్ బుక్ లైవ్ చాట్ లో  ధృవీకరించారు.  2017లో  కేబీసీ  గేమ్ షో  ఫ్రెష్  గా  మొదలుకావచ్చని బిగ్ బీ  తెలిపారు.

కాగా 2006 లో ఈ మొదలైన క్విజ్ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది.  సీజన్ల మధ్య  మళ్లీ  లాంగ్ గ్యాప్ తరువాత 2014లో  మళ్లీ ప్రసారమైంది. సెకండ్ సీజన్ లో కూడా అంతే స్థాయిలో  ఆకట్టుకుందీ ఈ  గేమ్  షో. పక్కా...లాక్ కర్ దూం.. అంటే తన  అద్భుతమైన గొంతుతో, విలక్షణమైన యాంకరింగ్ తో అమితాబ్  ఈ గేమ్ షో మరింత పాపులారిటీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement