జమ్మూలో అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం | Amarnath Yatra resumed after three days in Jammu | Sakshi
Sakshi News home page

జమ్మూలో అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం

Aug 13 2013 11:00 AM | Updated on Aug 17 2018 8:06 PM

గత మూడు రోజుల క్రితం రద్దు అయిన అమర్నాథ్ యాత్రను ఈ రోజు నుంచి పునరుద్దరించామని ఉన్నతాధికారులు మంగళవారం జమ్మూలో వెల్లడించారు.

గత మూడు రోజుల క్రితం రద్దు అయిన అమర్నాథ్ యాత్రను ఈ రోజు నుంచి పునరుద్దరించామని ఉన్నతాధికారులు మంగళవారం జమ్మూలో వెల్లడించారు.   అయితే ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూను కొనసాగుతుందని తెలిపారు. అయితే సోమవారం పలు ప్రాంతాల్లో రెండు మూడు గంటలపాటు కర్ఫ్యూను సడలించారు. దాంతో ఆయా జిల్లాలోని ప్రజలకు పలు కొంతలో కొంత ఉపశమనం కలిగింది. ఘర్షణ వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధిలు శాంతి ర్యాలీలను నిర్వహించారు.

 

అయితే కిష్ట్వార్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని షాలిమార్ చౌక్ వద్ద కొందరు వ్యక్తులు సోమవారం పోలీసుల వాహనానికి నిప్పుంటించారు. ఈ ఘటనకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారందరికి కిష్ట్వార్లో జరిగిన మతఘర్షణలతో సంబంధం ఉందని ఉన్నతాధికారి తెలిపారు.  కిష్ట్వార్ జిల్లాలో శుక్రవారం ఇరువర్గాల మధ్య  మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, దాదాపు 60 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో శుక్రవారం విధించిన కర్ఫ్యూ మంగళవారం ఐదోరోజుకు చేరింది.  అలాగే ఇతర జిల్లాల్లో విధించిన కర్ప్యూ నాలుగో రోజుకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement