
‘దొంగ’ ముద్దుతో దొరికారు!
ఫ్రాన్స్‌లో ఓ నగల దుకాణం. గతేడాది ఓ రోజు ఇద్దరు ముసుగు దొంగలు చొరబడ్డారు. దుకాణం యజమాని అయిన 56 ఏళ్ల మహిళను కట్టేశారు.
లండన్: ఫ్రాన్స్‌లో ఓ నగల దుకాణం. గతేడాది ఓ రోజు ఇద్దరు ముసుగు దొంగలు చొరబడ్డారు. దుకాణం యజమాని అయిన 56 ఏళ్ల మహిళను కట్టేశారు. తలపై పెట్రోలు పోసి.. అరిస్తే తగలబెడతామని బెదిరించారు. ఒక దొంగ కాపలాగా ఉండగా మరో దొంగ మొత్తం దోచేశాడు. తర్వాత ఆమె కట్లు విప్పేసి ఇద్దరూ వెళ్లిపోయారు. పోలీసులకు దొరకకుండా ఏ ఒక్క ఆధారమూ వదలలేదు.
కానీ, చివరికి దొరికిపోయారు. మహిళ కట్లు విప్పే ముందు కాపలాగా ఉన్న దొంగ ఆమె బుగ్గపై పెట్టిన ముద్దే పట్టించింది. ఆమె బుగ్గపై దొంగ లాలాజలాన్ని సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు డీఎన్‌ఏను విశ్లేషించారు. ఆ సమాచారం ఆధారంగా దొంగను పట్టుకున్నారు.