రూ.23 రీచార్జ్ తో అన్లిమిటెడ్ ఆఫర్ | Aircel Launches New Unlimited Calling Plans Starting Rs. 23 | Sakshi
Sakshi News home page

రూ.23 రీచార్జ్ తో అన్లిమిటెడ్ ఆఫర్

Dec 21 2016 7:25 PM | Updated on Jun 4 2019 6:47 PM

రూ.23 రీచార్జ్ తో అన్లిమిటెడ్ ఆఫర్ - Sakshi

రూ.23 రీచార్జ్ తో అన్లిమిటెడ్ ఆఫర్

టెలికాం రంగంలో కొనసాగుతున్న ప్రైస్ వార్ లోకి తాజాగా మరో టెలికాం ఆపరేటర్ ఎయిర్ సెల్ దూసుకువచ్చింది. వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ పధకాలను బుధవారం లాంచ్ చేసింది.

ముంబై: టెలికాం రంగంలో కొనసాగుతున్న  ప్రైస్ వార్ లోకి తాజాగా మరో టెలికాం ఆపరేటర్ ఎయిర్ సెల్  దూసుకువచ్చింది.  వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ పధకాలను బుధవారం లాంచ్  చేసింది.  ఏ నెట్వర్క్ కైనా ఉచిత అపరిమిత కాల్స్ అందించే  సరికొత్త ఆఫర్ ను అందిస్తోంది. రూ. 23లతో మొదలయ్యే  రీచార్జ్ లపై  బంపర్ ఆఫర్లు  ప్రకటించింది.
రూ23,  రీఛార్జ్ పై  వినియోగదారులు ఒక రోజు ఒక చెల్లుబాటుతో  ఏ నెట్ వర్కుకైనా అపరిమిత స్థానిక ,  ఎస్టీడీ కాలింగ్  అవకాశాన్ని అందిస్తున్నట్టు ఎయిర్సెల్ ఒక ప్రకటనలో తెలిపారు.

రూ . 348  రీఛార్జ్   (స్థానిక మరియు ఎస్టీడీ) అంతటా ఉచిత కాల్స్ అపరిమిత కాలింగ్ సౌకర్యంతో పాటూ 500 ఎంబీ 3జీ డేటా  , 4జీ  వినియోగదారులకు 1.5జీబీ 3జీ డేటా ఉచితంగా అందిస్తోంది.వాలిడిటీ 28 రోజులు.

వినియోగదారులను సంతోషపెట్టేందుకు ఉచిత కాలింగ్, డాటా సదుపాయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని ఎయిర్సెల్ లిమిటెడ్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, అనుపమ్ వాసుదేవ్ తెలిపారు. వినియోగదారులకు ఆహ్లాదం,  కాల్ మరియు డేటా  ప్రయోజనాలు అందించేందుకు , అందుబాటుధరల్లో  ఆన్ లైన్ సదుపాయాన్ని  కల్పించేందుకు  ఈ రెండు పథకాలను లాంచ్ చేసినట్టు  పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement