కన్ఫర్మ్‌: రాజమౌళి నెక్స్ట్‌ సినిమా అది కాదు! | after Baahubali SS Rajamouli NOT MAKING THIS MOVIE | Sakshi
Sakshi News home page

కన్ఫర్మ్‌: రాజమౌళి నెక్స్ట్‌ సినిమా అది కాదు!

Jan 22 2017 4:18 PM | Updated on Sep 5 2017 1:51 AM

కన్ఫర్మ్‌: రాజమౌళి నెక్స్ట్‌ సినిమా అది కాదు!

కన్ఫర్మ్‌: రాజమౌళి నెక్స్ట్‌ సినిమా అది కాదు!

ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ’బాహుబలి’ ఘనవిజయం సాధించడంతో ఈ సినిమా రెండోపార్టు తర్వాత ఆయన తీయబోయే సినిమాపై

ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ’బాహుబలి’ ఘనవిజయం సాధించడంతో ఈ సినిమా రెండోపార్టు తర్వాత ఆయన తీయబోయే సినిమాపై భారీ అంచనాలు, ఊహాగానాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ మహాభారత గాథను సినిమాగా తెరకెక్కించాలనే ఆలోచన ఉందని చెప్పారు. దీంతో రాజమౌళి తదుపరి సినిమా మహాభారతమేనని ఊహాగానాలు,  కథనాలు వస్తున్నాయి.

అయితే, రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత కే విజయేంద్రప్రసాద్‌ మాత్రం ఈ ఊహాగానాలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇవి కేవలం సెన్సేషనల్‌ రూమర్సే తప్ప మరేమీ కావన్నారు. ’నేను కానీ, రాజమౌళి కానీ ఈ కథ రాయడం ఎవరైనా చూశారా? నేను సూటిగా చెప్తున్నా. ప్రస్తుతం మహాభారతం తీసే ఆలోచనే లేదు. బాహుబలి రెండోపార్టును సమగ్రంగా తీర్చిదిద్ది.. అనుకున్న తేదీ ప్రకారం ఏప్రిల్‌  28న విడుదల చేయడానికి నిరంతరం మేం కృషి చేస్తున్నాం’ అని ఆయన అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement