ఆప్ లో చేరిన మహాత్మాగాంధీ మనవడు | AAP Rajmohan Gandhi joins AAP Party | Sakshi
Sakshi News home page

ఆప్ లో చేరిన మహాత్మాగాంధీ మనవడు

Feb 21 2014 6:33 PM | Updated on Aug 20 2018 3:46 PM

మహత్మా గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు.

న్యూఢిల్లీ: మహత్మా గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు.అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నఆప్ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ విధానాలు తనకు నచ్చడంతో పార్టీలో చేరినట్టు రాజ్ మోహన్ తెలిపారు.దేశంలో అవినీతి హెచ్చరిల్లి ధనిక, పేదల మధ్య తారతమ్యం పెరిగిపోయిందన్నారు.అవినీతిని రూపుమాపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నపోరాటం తనను ఆకట్టుకుందన్నారు.

 

ఆప్ తరుపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కాగా ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై మాత్రం నిరాకరించారు. ఈ 78 ఏళ్ల రాజ్ మోహన్ గాంధీ.. గతంలో ఆమేథీ నుంచి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement