అసోంలో ఉగ్రవాద దాడి: ఇద్దరు మృతి | A policeman and a civilian killed in Assam | Sakshi
Sakshi News home page

అసోంలో ఉగ్రవాద దాడి: ఇద్దరు మృతి

Sep 26 2013 6:42 PM | Updated on Sep 1 2017 11:04 PM

అసోంలో నేషనల్ డెమొక్రటిక్ బోడోలాండ్ ఫ్రంట్ (ఎన్డీఎఫ్బీ)కి చెందిన ఉగ్రవాదులు గురువారం జరిపిన దాడిలో ఇద్దరు మరణించారు. చనిపోయిన వారిలో ఒక పోలీసు అధికారి, మరో పౌరుడు ఉన్నారు.

అసోంలో నేషనల్ డెమొక్రటిక్ బోడోలాండ్ ఫ్రంట్ (ఎన్డీఎఫ్బీ)కి చెందిన ఉగ్రవాదులు గురువారం జరిపిన దాడిలో ఇద్దరు మరణించారు. చనిపోయిన వారిలో ఒక పోలీసు అధికారి, మరో పౌరుడు ఉన్నారు. అసోంలోని కొక్రాజర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శాంతి చర్చలను వ్యతిరేకిస్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనంపై ఆకస్మిక దాడి చేశారు.

భద్రతాధికారులు వెంటనే ప్రతిదాడి చేయడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ సంఘటనలో సబ్ ఇన్స్పెక్టర్ నారాయణ బర్మన్, మదన్ రాయ్ అనే వ్యక్తి మరణించినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement