87 కంపెనీలు కనబడుట లేదు! | 87 firms in 'vanishing companies' list: Sachin Pilot | Sakshi
Sakshi News home page

87 కంపెనీలు కనబడుట లేదు!

Aug 12 2013 2:21 AM | Updated on Sep 1 2017 9:47 PM

87 కంపెనీలు కనబడుట లేదు!

87 కంపెనీలు కనబడుట లేదు!

ప్రజల నుంచి నిధులను సమీకరించాక జెండా ఎత్తేసిన 87 కంపెనీలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

న్యూఢిల్లీ: ప్రజల నుంచి నిధులను సమీకరించాక జెండా ఎత్తేసిన 87 కంపెనీలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇలా కనిపించకుండా పోయిన కంపెనీలు, డెరైక్టర్లపై తగిన చర్యలను చేపట్టేందుకుగాను ఆరా తీయడం మొదలు పెట్టింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం వివిధ రాష్ట్రాలకు చెందిన ఆయా కంపెనీలు, డెరైక్టర్లపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసింది. కాగా, కనిపించకుండా పోయిన కంపెనీల జాబితాలో గుజరాత్ ముందుంది.
 
  మొత్తం 26 కంపెనీలు బిచాణా ఎత్తేయగా, ఇలాంటి 13 సంస్థలతో రాష్ర్టం ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ బాటలో తమిళనాడు(10), మహారాష్ర్ట(9), ఢిల్లీ(5), పశ్చిమ బెంగాల్(5), మధ్య ప్రదేశ్(5), ఉత్తర ప్రదేశ్(4), బీహార్(4) తదుపరి స్థానాల ను పొందాయి. ఈ కంపెనీల బ్యాలన్స్ షీట్లు, తదితర రికార్డులను పరిశీలించడం ద్వారా నిధుల సమీకరణ వివరాలు, సమీకరించిన నిధుల వినియోగం వంటి విషయాలను ఆరా తీయాల్సిందిగా ఇప్పటికే కంపెనీల రిజిస్ట్రార్‌కు(ఆర్‌వోసీలు) ఆదేశాలు జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement