మావోయిస్టులు పెడుతున్న చిత్రహింసలు తట్టుకోలేక.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి దాదాపు 11 కుటుంబాలు ఖమ్మం జిల్లాకు వలస వచ్చాయి.
మావోయిస్టులు పెడుతున్న చిత్రహింసలు తట్టుకోలేక.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి దాదాపు 11 కుటుంబాలు ఖమ్మం జిల్లాకు వలస వచ్చాయి. మొత్తం 70 కుటుంబాలు అక్కడి నుంచి బయల్దేరాయి. వేర్వేరు గ్రామాలకు వెళ్లిన వారిలో 11 కుటుంబాలు మాత్రం వాజేడు ప్రాంతానికి చేరుకున్నాయి.
తమకు భోజనాలు పెట్టడం లేదని ఒకవైపు మావోయిస్టులు... మరోవైపు మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ పోలీసులు వేధిస్తున్నారని, ఈ వేధింపులను తట్టుకోలేకనే తాము ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చేశామని ఆయా కుటుంబాల వారు చెప్పారు. ఓఎస్డీ తిరుపతి వారిని పరామర్శించారు. వారికి నెల రోజులకు సరిపడ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.
నిజ నిర్ధారణ కమిటీలు, ప్రజాసంఘాలు ఇలాంటి బాధితులను ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఎప్పుడైనా ఎన్కౌంటర్లు జరిగితే అవి బూటకం అంటున్నారని, మరి ఈ గిరిజనుల వాదన వారికి కనపడట్లేదా అని ప్రశ్నించారు. ప్రజల కోసం పాటు పడుతామని చెప్పే మావోయిస్టులు చేసేది ఇదేనా అని ఆయన నిలదీశారు.