45 లక్షల స్మార్ట్ ఫోన్లు మాయం.. కొట్టేశారు! | 4.5 million smartphones were lost or stolen in US in 2013 | Sakshi
Sakshi News home page

45 లక్షల స్మార్ట్ ఫోన్లు మాయం.. కొట్టేశారు!

Apr 21 2014 3:01 PM | Updated on Sep 2 2017 6:20 AM

45 లక్షల స్మార్ట్ ఫోన్లు మాయం.. కొట్టేశారు!

45 లక్షల స్మార్ట్ ఫోన్లు మాయం.. కొట్టేశారు!

వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా 45 లక్షల (4.5 మిలియన్) స్మార్ట్ ఫోన్లు యూఎస్ వినియోగదారుల నుంచి చోరికి గురవ్వడమో..పోగొట్టుకోవడమో జరిగిందని తాజా నివేదికలో వెల్లడించారు.

లాస్ ఎంజెలెస్: వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా 45 లక్షల (4.5 మిలియన్) స్మార్ట్ ఫోన్లు యూఎస్ వినియోగదారుల నుంచి  చోరికి గురవ్వడమో..పోగొట్టుకోవడమో జరిగిందని తాజా నివేదికలో వెల్లడించారు. గతం సంవత్సరం 28 లక్షల స్మార్ట్ పోన్ల కంటే ప్రస్తుత సంఖ్య గణనీయంగా పెరిగినట్టు తాజా కన్యూమర్ రిపోర్ట్ తెలిపింది. ప్రతి ఏటా ఈ సంఖ్య రెండింతలవుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2012 లో 16 లక్షలు, 2013లో 31 లక్షలుగా నివేదికలో వెల్లడించారు. 
 
ఫోన్ లో డేటా తొలగింపు, సాఫ్ట్ వేర్ ఇన్స్ స్టాలేషన్ చేయడం, ఇతర కారణాల వల్ల 34 శాతం మంది వినియోగ దారులు చోరికి గురైన స్మార్ట్ ఫోన్లను తీసుకోవడానికి ఉత్సాహం చూపలేదని సర్వేలో వెల్లడైంది. నాలుగంకెల పాస్ వర్గ్ ను వినియోగదారులు పెట్టుకోవాలని కన్యూమర్ రిపోర్ట్స్ సూచించింది. 
 
వినియోగదారులు కనీస జాగ్రత్తలు పాటించడం లేదని సర్వేలో వెల్లడైంది. స్మార్ట్ ఫోన్లలో పొందుపరిచిన వ్యకిగత సమాచారంలో ముఖ్యంగా ఫోటోలు, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియా కోసం ఈ-మెయిల్ అకౌంట్లు, షాపింగ్, బ్యాంకింగ్ యాప్స్ ఉన్నాయని నివేదికలో వెల్లడైంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement