కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం | 36 dead, 7 missing in Hiroshima landslides | Sakshi
Sakshi News home page

కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం

Aug 20 2014 7:13 PM | Updated on Sep 2 2017 12:10 PM

బురదలో కూరుకుపోయిన, కొట్టుకుపోతున్న ఇళ్లు

బురదలో కూరుకుపోయిన, కొట్టుకుపోతున్న ఇళ్లు

పశ్చిమ జపాన్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హిరోషిమా ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురియడంతో కొండచరియలు విరిగిపడి 32 మంది దుర్మరణం చెందారు.

టోక్యో:    పశ్చిమ జపాన్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హిరోషిమా ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురవడంతో  కొండచరియలు విరిగిపడి  32 మంది దుర్మరణం చెందారు. మరో 7 మంది గల్లంతయ్యారు. హిరోషిమా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో   ఇళ్లు  పెద్ద సంఖ్యలో నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపారు. వరదలా ప్రవహించిన బురద ఇళ్లను చుట్టుముట్టింది. కొన్ని ఇళ్లు ఆ బురద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. బాధిత ప్రాంతాల్లో రక్షణ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే సూచనలున్నాయని హిరోషిమా పోలీసులు తెలిపారు.

 సంఘటనా స్థలంలో రక్షణ సిబ్బందికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి  ఐదుగురి ప్రాణాలను కాపాడారు. అయితే ఆ వెంటనే మరోసారి కొండచరియ విరిగి మీద పడటంతో అతను ప్రాణాలు కోల్పోయారు.  కూలిన ఇళ్ల శిథిలాల కింద ప్రాణాలతో ఎవరైనా మిగిలి ఉంటే వారిని రక్షించేదుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement