వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడిగా కొండా రాఘవరెడ్డి, జిల్లా సహ పరిశీలకులుగా ఆకుల మూర్తి, జి.శ్రీధర్‌రెడ్డి ....
వరంగల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడిగా కొండా రాఘవరెడ్డి, జిల్లా సహ పరిశీలకులుగా ఆకుల మూర్తి, జి.శ్రీధర్‌రెడ్డి నియమితులయ్యారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు శుక్రవారం నియామకాలు పూర్తి చేశారు.
రాఘవరెడ్డి, మూర్తి ప్రస్తుతం రాష్ట్ర అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీధర్‌రెడ్డి ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. వరంగల్ జిల్లాలో వైఎస్సార్‌సీపీ పటిష్టతకు కృషి చేస్తామని కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు.