చెల్లెల్ని ప్రేమించాడని చంపేశారు

చెల్లెల్ని ప్రేమించాడని చంపేశారు - Sakshi


కరీంనగర్(గోదావరిఖని): గోదావరిఖనిలోని ఎయిట్‌ఇన్‌క్లెయిన్ కాలనీలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. వివరాలు.. కాలనీకి చెందిన సదానందం(25), అదేకాలనీకి చెందిన పులిపాక సతీష్ చెల్లెలు ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వరసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. ఈ విషయం గురించి పలుమార్లు సతీష్, సదానందంను హెచ్చరించినా పెడచెవిన పెట్టడంతో పరువు పోతుందని భావించి సతీష్ కుటుంబసభ్యులంతా కలిసి గురువారం రాత్రి గొంతునులిమి చంపేశారు.పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు న మోదు చేసుకున్నారు. వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సతీష్‌తో ఈ హత్యలో పాల్గొన్న కుటుంబసభ్యులు, అతని స్నేహితుడు కటిక శేఖర్‌లు పరారీలో ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top