ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య | young man suicide with financial difficulties | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

Oct 25 2017 3:34 PM | Updated on Oct 2 2018 5:51 PM

young man suicide with financial difficulties - Sakshi

నవీపేట(బోధన్‌): మండలంలోని ఫతేనగర్‌ గ్రామానికి చెందిన రమేష్‌గౌడ్‌(29) అనే యువకుడు మంగళవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ రవీందర్‌ నాయక్‌ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్థాపానికి గురైన రమేష్‌ గౌడ్‌ తన కల్లుబట్టీలో ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. భార్య లాస్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి మణితేజ్‌ అనే రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నట్లు ఆయన  పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement