రాంపూర్‌లో యువతి ఆత్మహత్య | women suicide in warangal district | Sakshi
Sakshi News home page

రాంపూర్‌లో యువతి ఆత్మహత్య

Feb 16 2016 8:48 AM | Updated on Sep 3 2017 5:46 PM

వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

ధర్మసాగర్: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రాంపూర్ గ్రామానికి చెందిన స్రవంతి(22) అనే యువతి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సోమవారం రాత్రి ఓ కేసు విషయమై తన అన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు స్రవంతి అన్నను తీసుకెళ్లే సమయంలో అడ్డుపడటంతో వారు పక్కకు తోసేశారు. దీంతో మనస్తాపం చెంది సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement