మా తల్లిని కాపాడండి.. కేటీఆర్‌కు యువతి వినతి

Women Software Request To KRT In Social Media For Protect Mother - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌ ఉంటారు. దీంతో అనేక మంది తమ సమస్యలను సోషల్‌ మీడియా వేదికగానే కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా విధులు నిర్వర్తిస్తున్న గరీమా అనే యువతి మంత్రి దృష్టికి ఓ సమస్యను తీసుకువచ్చారు. బిహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారన్ జిల్లాలో అపహరణకు గురైన తన తల్లిని కాపాడాలని ట్విటర్‌లో కేటీఆర్‌ను వేడుకున్నారు.

దీనిపై వెంటనే స్పందించిన ఆయన.. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ ద్వారా బిహార్‌ డీజీపీ దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. దీనిపై ఆదివారం సాయంత్రం ఆ యువతి మరోసారి గుర్తుచేసింది. తానే స్వయంగా ఆ రాష్ట్ర పోలీసుశాఖ అధికారులతో మాట్లాడానని, మీ తల్లి త్వరగా మిమ్మల్ని చేరుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మీ తల్లి సురక్షితంగా ఇంటికి తిరిగివస్తుందని నమ్ముతున్నానని కేటీఆర్ సమాధానమిచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top