గోడకూలి మహిళ మృతి | woman dies of rain season | Sakshi
Sakshi News home page

గోడకూలి మహిళ మృతి

Apr 12 2015 12:24 PM | Updated on Sep 3 2017 12:13 AM

నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు పాత గోడ కూలి ఒక మహిళ మృతి చెందింది.

నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలకు పాత గోడ కూలి ఒక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరగట్లు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన యమునాబాయి (50) ఇంటి ముందు ఉన్న పాత గోడ దగ్గర కూర్చోని ఉంది. అయితే, అదే సమయంలో ప్రమాదవశాత్తు గోడ కూలి మీదపడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల కింద ఉన్న మహిళ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టానికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(రెంజల్)

Advertisement
 
Advertisement
Advertisement