ప్రపంచం ఆశ్చర్యపోయే లా ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను ని ర్వహిస్తున్నదని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ‘బతుకమ్మ’ ను ప్రపంచానికి పరిచయం.,.
జెడ్పీసెంటర్: ప్రపంచం ఆశ్చర్యపోయే లా ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను ని ర్వహిస్తున్నదని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌అన్నారు. సోమవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ‘బతుకమ్మ’ ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఎంపీ కవితకు దక్కుతుందన్నారు. ఆమె కృషి ఫలితంగానే 143 దేశాల్లో బతుకమ్మ వేడుకలు చేసుకుంటున్నారన్నారు. మహిళల పండుగ అరుునందున జిల్లా వ్యా ప్తంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సమైక్య రాష్ట్రంలో బ తుకమ్మ వివక్షకు గురైనందునే తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగకు అధికారిక గుర్తింపు ఇచ్చారన్నారు.
ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించకపోగా అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం కోసం పని చే స్తున్న ముఖ్‌యమంత్రిపై విమర్శలు చే స్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. ఆంధ్రరాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసు ్తన్నా వారు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. వచ్చే నెల 1వ తేదీన జిల్లా పరి షత్ మైదానంలో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు నిజామాబాద్ ఎంపీ క విత హాజరు కానున్నట్లు తెలిపారు. కా ర్యక్రమానికి జిల్లాలోని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరు కావాలన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు వన జా, జ్యోతి, టీఆర్‌ఎస్ రాజేశ్వర్‌గౌడ్, వెం కటయ్య, శివకుమార్, జాగ్రతి మహిళ కన్వీనర్ చద్రకళ పాల్గొన్నారు.