రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధ్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.
నల్లగొండ: రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధ్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. నల్లగొండ జిల్లాలోని బుధవారం మంత్రి బీబీనగర్ మండలంలో ఆయన పర్యటించారు. మండలంలోని భట్టుగూడెం, గుర్రాలదండి, జంపల్లి, నీలంబావి గ్రామాల్లో వడగండ్ల వాన, ఈదురు గాలులకు దెబ్బతిన్న తోటలను పరిశీలించారు. అలాగే బాధిత రైతులతో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మోహన్‌బాయ్ కందారియా అన్నారు. మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి ఆయన జిల్లాలో పర్యటించారు. ఆయన నీలంబావిలోని రాలిన మామిడి తోటలను పరిశీలించారు.
(బీబీనగర్)