మున్సిపాలిటీ వచ్చే..  ఉపాధి పోయే..!

Upadi Hami Pathakam Not Implemented Rangareddy - Sakshi

ఇబ్రహీంపట్నంరూరల్‌: మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో కూలీలు ఉపాధి హామీ పనులు కోల్పోయారు.  నిబంధనల ప్రకారం మున్సిపాలిటీలలో ఉపాధి హామీ పథకం వర్తించదు. ఇబ్రహీంపట్నం నియో జవర్గంలోని తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలను  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  మంగళ్‌పల్లి, యంపీ పటేల్‌గూడ, రాందాస్‌పల్లి, బొంగ్లూర్, కొంగరకలాన్, ఆదిబట్ల గ్రామాలతో ఆదిబట్ల మున్సిపాలిటీ ఏర్పడింది. ఇంతకుముందు ఈ ఆరు గ్రామాల్లో 1728 మంది కూలీ లు ఉపాధి హామీ జాబ్‌కార్డులు పొందారు. ఉపా ధి పనులు జరిగే సమయంలో వీరు రోజుకు రూ. 150 నుంచి రూ.180 వరకు సంపాదిస్తారు. అయితే వారు ఇప్పుడు మున్సిపాలిటీ ఏర్పాటుతో ఉపాధి కోల్పోయారు. సూమారు 5వేల మందికి పైగా కూలీలు పనులకు దూరమయ్యారు. పనులు ఆగిపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఫీల్డ్‌ అసిస్టెంట్లకు భరోసా .. 
గత 12 సంవత్సరాలుగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద కూలీలు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. అయితే, మున్సిపాలిటీ ఏర్పాటు తర్వాత కూలీలను పట్టించుకోని ప్రభుత్వం ఫీల్డ్‌ అసిస్టెంట్లకు మాత్రం భరోసా కల్పించింది. మున్సిపాలిటీల్లో విలీనం అయ్యే గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఇతర గ్రామాల్లో ఖాళీగా ఉన్న చోట పనిచేసే విధంగా వెసులుబాటు కల్పిస్తూ  ఉత్తర్వులు జారీచేసింది. కూలీలకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top