మెడపై నరికి.. గొంతుకోసి.. | Unidentified person brutal murder | Sakshi
Sakshi News home page

మెడపై నరికి.. గొంతుకోసి..

Mar 4 2015 3:35 AM | Updated on Sep 2 2017 10:14 PM

గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండలంలోని పొడిచేడు గ్రామశివారు మర్రిగడ్డ సమీపంలో బండపై మంగళవారం

    గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్య
     మోత్కూర్ మండలంలో ఘటన

 మోత్కూరు: గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండలంలోని పొడిచేడు గ్రామశివారు మర్రిగడ్డ సమీపంలో బండపై మంగళవారం రాత్రి  వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని గొర్రెల కాపరులు గొర్రెలను మేపుకుంటూ ఆళ్లగిరి వ్యవసాయ క్షేత్రంలోని బండ సమీపంలోకి వెళ్లేసరికి రక్తపు మడుగులో మృతిచెందిన వ్యక్తి కనిపించాడు. వెంటనే విషయాన్ని గ్రామ వీఆర్‌ఏకు తెలిపారు. ఆయన స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రామన్నపేట సీఐ ఏ.బాలగంగిరెడ్డి, మోత్కూరు ఎస్‌ఐ సి.పురేందర్‌భట్‌లు ఘటన స్థలా న్ని పరిశీలించారు. గ్రామస్తులను అడిగి వివరాలు సేకరించారు. ప్రత్యర్థులు వేటకొడవళ్లతో మెడపై నరికి, గొం తుకోసి దారుణంగా చంపినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగినట్టు తెలుస్తోంది. మృతు డు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట గ్రామానికి చెందిన సత్యనారయణగా భావి స్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృ తదేహాన్ని రామన్నపేట ఆస్పత్రికి తరలించారు. అన్ని కో ణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement