రోడ్డుపై వేగంగా వెళ్తున్న బైక్.. ప్రైవేట్ బస్సును ఢీ కొట్టింది.
మైసమ్మగూడ (రంగారెడ్డి జిల్లా) : రోడ్డుపై వేగంగా వెళ్తున్న బైక్.. ప్రైవేట్ బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలోని బహదూరపల్లి మైసమ్మగూడ వద్ద శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... నగరానికి చెందిన శ్రీధర్(21), నవీన్(22)లు కండ్లకోయలోని సీఎమ్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు.
కాగా శనివారం సాయంత్రం కాలేజీ అయిపోయాక బైక్‌పై వెళ్తుండగా దారిలో కారును ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ స్నేహితులిద్దరూ మరణించారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.