మాస్టర్ ... | Two of the best teachers selected for the national award | Sakshi
Sakshi News home page

మాస్టర్ ...

Aug 14 2015 1:55 AM | Updated on Sep 3 2017 7:23 AM

ఉత్తమ బోధన.. సామాజిక కార్యక్రమాలు నిర్వహించినందుకు జిల్లా నుంచి ఇద్దరు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇద్దరి ఎంపిక
5న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

 
 
ఉత్తమ బోధన.. సామాజిక కార్యక్రమాలు నిర్వహించినందుకు జిల్లా నుంచి ఇద్దరు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యూరు.
 ఒకరు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ డాక్టర్ ఎండీ రాజ్‌మహ్మద్ కాగా, మరొకరు తొర్రూరు మండలం మాటేడు పీఎస్ ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా పనిచేస్తున్న పరాంకుశం రఘునారాయణ. వీరిద్దరు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం రోజున ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. - విద్యారణ్యపురి

 నల్గొండ జిల్లా వలిగొండకు చెందిన పరాంకుశం రఘునారాయణ 1984లో ఎస్జీటీగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. నాటి నుంచి అంకితభావంతో విధులు నిర్వహిస్తూ విద్యార్థుల ఉన్నతికి పాటుపడుతున్నారు. విద్యబోధనతోపాటు సామాజిక సేవలోనూ ఈయన ముందుంటున్నారు. అంతర్‌జిల్లా బదిలీల్లో పాలకుర్తితోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సేవలందించారు. 2013లో తొర్రూరు మండలం మాటేడు యూపీఎస్‌లో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా నియమితులయ్యూరు.  

 పాఠశాలల్లో వసతుల కోసం కృషి
 వివిధ స్వచ్ఛంద సంస్థల సహాకారంతో పాఠశాలలో ఫర్నీచర్ ఇతర పరికరాలను రఘునారాయణ సేకరించారు. నోటు పుస్తకాలు, టై బెల్టులు నగదు, వస్తు రూపేణ బహుమతులు ఇచ్చే వారిని ప్రోత్సహించేవారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపునకు ఇంటింటి ప్రచారం చేసేవారు. ఉపాధ్యాయులతో ప్రభావవంతంగా విద్యాబోధన చే రుుంచేవారు. పాఠశాలల్లో  మొక్కలను నాటించారు. బడితోటకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.

 రచయితగానూ ముద్ర..
 బాలరంజని గేయమాలిక రచించటంతోపాటు ఆకాశవాణి ద్వారా ప్రసంగాలు కూడా చేశారు. పలు దిన,వార,మాసపత్రికల్లో వ్యాసాలు, 50 కవితలు రాశారు. తెలుగు ప్రపంచ సభలకూ ప్రతినిధిగా వెళ్లారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుండేవారు. 2007లో జిల్లాస్థాయిలో, 2008లో రాష్ర్టస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందారు. ఏపీ స్టేట్ కల్చరల్ అవేర్‌నెస్ సొసైటీ ఆధ్వర్యంలో డైమండ బెస్‌టిజిన్ అవార్డు అందుకున్నారు. భద్రాచంలో సర్వేపెల్లి వాలంటరీ ఆర్గనైజేషన్‌ద్వారా సర్వేపెల్లి పురస్కారం, సాహిత్యసంస్కృతిక అకాడమీ ద్వారా గురజాడ అవార్డు అందుకున్నారు.  
 
 అంకితభావం రఘునారాయణ ఆస్తి

 మరింతగా బాధ్యత పెరిగింది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావటంతో నా బాధ్యత మరింత పెరిగింది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు మరింత గా శ్రమిస్తాను. విద్యార్థుల్లోనూ సామాజిక స్ప­ృహ అలవర్చేలా ప్రయత్నిస్తాను. నేను అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డు రావడం ఆనందంగా ఉంది. అవార్డు కింద వచ్చే రూ. 50 వేలను మాటేడు ప్రాధమిక పాఠశాల విద్యార్థుల అభివృద్ధి కోసం వినియోగిస్తా.  
 - రఘునారాయణ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement