వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో గురువారం వరకు 9 ైస్వైన్ ప్లూ అనుమానిత కేసుల నమూనాలను హైదరాబాద్‌కు....
ఎంజీఎం : వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో గురువారం వరకు 9 ైస్వైన్ ప్లూ అనుమానిత కేసుల నమూనాలను హైదరాబాద్‌కు పంపించామని, ఇందులో రెండు కేసులు పాజిటివ్ అని తేలినట్లు ఎంజీఎం ఆర్‌ఎంఓ హేమంత్, మెడిసిన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు. నర్సంపేటకు చెం దిన ప్రవీణ్ కేసు జిల్లాలో ్టమొదటి స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసు కాగా, ఆయన ఆరోగ్య పరి స్థితి మెరుగ్గానే ఉందన్నారు. కరీంనగర్ జిల్లా రామగుండానికి చెందిన రెండేళ్ల బా లుడు అంజా ఎంజీఎంలో చికిత్స పొం దుతూ మరణించాడని వెల్లడించారు. అంజా ఈ నెల 25న ఆస్పత్రిలో అడ్మిట్ అ య్యాడని, ఈ నెల 27న తెమడ నమూ నాలు సేకరించి హైదరాబాద్‌కు పం పిం చామన్నారు.
ఈ క్రమంలోఅదేరోజు రాత్రి మృతి చెందాడని, బుధవారం రాత్రి నివే దికలందాయని వివరించారు. పెద్దమ్మ గడ్డ కు చెందిన తనూజ, కరీంనగర్ జిల్లా సైదాపూర్‌కు చెందిన సరోజన, ఆత్మకూర్‌కు చెం దిన బి.స్వప్న, మొగుళ్లపల్లి రంగాపురానికి చెందిన వెంకటయ్య, ఆత్మకూరు మం డలం కొత్తపేటకు చెరందిన బుజ్జికి నెగిటివ్‌గా తేలిందన్నారు. రామగుండానికి చెం దిన బొక్క రమేశ్‌కు సంబంధించిన నివేదిక అందాల్సి ఉందని వారు పేర్కొన్నారు.