వాణిజ్యపన్నుల శాఖలో బదిలీలు | Transfers in Commercial Taxes department | Sakshi
Sakshi News home page

వాణిజ్యపన్నుల శాఖలో బదిలీలు

Aug 22 2015 7:10 PM | Updated on Sep 4 2018 5:16 PM

వాణిజ్య పన్నుల శాఖ ప్రక్షాళనలో భాగంగా బుధవారం 73 మంది సీటీవోలను బదిలీ చేసిన ప్రభుత్వం.. శనివారం మరో 14 మందిని బదిలీ చేసింది.

హైదరాబాద్ : వాణిజ్య పన్నుల శాఖ ప్రక్షాళనలో భాగంగా బుధవారం 73 మంది సీటీవోలను బదిలీ చేసిన ప్రభుత్వం.. శనివారం మరో 14 మందిని బదిలీ చేసింది. ఒక అడిషనల్ కమిషనర్, ముగ్గురు డిప్యూటీ కమిషనర్(డీసీ)లు, పది మంది అసిస్టెంట్ కమిషనర్ల(ఏసీ)ను బదిలీ చేస్తూ శనివారం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజేయ కల్లం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జాబితాలో తెలంగాణ నుంచి రాష్ట్రానికి కేటాయించిన తొమ్మిది మంది అధికారులు ఉన్నారు.

తెలంగాణ నుంచి రాష్ట్రానికి కేటాయించిన అడిషనల్ కమిషనర్ జి.వెంకటేశ్వర్లును కమిషనర్ కార్యాలయంలో నియమించింది. ఇక తెలంగాణ నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఎన్.సుభద్రను కర్నూల్ జిల్లా డీసీగానూ.. ఎస్.ఈశ్వరయ్య, ఐ.శ్రీనగేష్‌లను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయంలోనూ నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement