కుక్క నోట మృత శిశువు | toddler dead body carring dog cought in nizambad | Sakshi
Sakshi News home page

కుక్క నోట మృత శిశువు

Jan 14 2016 10:43 PM | Updated on Sep 29 2018 4:26 PM

నిజామాబాద్ నగరంలోని పూలాంగ్‌చౌరస్తాలో దారుణం చోటుచేసుకుంది.

నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ నగరంలోని పూలాంగ్‌చౌరస్తాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుక్క మూడు రోజుల పసికందు (మగ శిశువు) మృతదేహాన్ని నోట కరుచుకొని వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. గురువారం సాయంత్రం కుక్క నోట శిశువు మృతదేహాన్ని గమనించిన ఓ ఆటోడ్రైవర్ వెంటపడడంతో శిశవు మృతదేహాన్ని వదిలేసి పరుగుతీసింది. డ్రైవర్‌తో పాటు స్థానికులు మృతదేహాన్ని తీసుకువచ్చి రోడ్డు పక్కన ఉంచి నాలుగవటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టమ్ కోసం తరలించారు. ఖననం చేయకుండా మృత శిశువును ఏదైనా ఆస్పత్రి నుంచి బయట పడవేశారేమో అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement