breaking news
todder
-
కుక్క నోట మృత శిశువు
నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ నగరంలోని పూలాంగ్చౌరస్తాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుక్క మూడు రోజుల పసికందు (మగ శిశువు) మృతదేహాన్ని నోట కరుచుకొని వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. గురువారం సాయంత్రం కుక్క నోట శిశువు మృతదేహాన్ని గమనించిన ఓ ఆటోడ్రైవర్ వెంటపడడంతో శిశవు మృతదేహాన్ని వదిలేసి పరుగుతీసింది. డ్రైవర్‌తో పాటు స్థానికులు మృతదేహాన్ని తీసుకువచ్చి రోడ్డు పక్కన ఉంచి నాలుగవటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టమ్ కోసం తరలించారు. ఖననం చేయకుండా మృత శిశువును ఏదైనా ఆస్పత్రి నుంచి బయట పడవేశారేమో అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఆటో ఢీకొని చిన్నారి మృతి
నాగోలు: ఆటో ఢీకొని చిన్నారి మృతి చెందిన సంఘటన ఆదివారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మన్సూరాబాద్ వినాయక్‌నగర్‌కు చెందిన పి.సోమయ్య కూతురు పి.అనూష (ఒకటిన్నర సంవత్సరాలు) ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆటో (ఏపీ22 డబ్ల్యు 4945) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అనూష తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి అనూష మృతి చెందింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.