నేటి ముఖ్యంశాలు...

Today News Headlines - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె బుధవారానికి ఐదో రోజుకు చేరుకుంది. సమ్మెపై నేడు కీలక చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వంతో ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. ఆర్టీసీ
మ్మెపై అఖిలపక్షాలు చర్చలు జరపనున్నాయి. మరోవైపు పూర్తి కార్యాచరణకు కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమవుతోంది.

నేటి నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనలకు దిగుతున్నారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యులు నిరసనలు చేపడుతున్నారు.

తిరుమలలో నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభమవుతాయి. నేటి నుంచి దివ్య దర్శనం, టైమ్‌స్లాట్‌ టోకెన్లు జారీ చేయనున్నారు.

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి భవానీ భక్తులు దీక్ష విరమించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజరాజే​శ్వరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.

ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి వెళ్లనున్నారు. వైఎస్సార్‌సీపీ రాజమండ్రి నగర సమన్వకర్త శివరామసుబ్రహ్మణ్యం కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరవుతారు.

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అదుపులోకి రావడంతో పాఠశాలలు, కాలేజీలు నేడు పునఃప్రారంభం కానున్నాయి. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో దాదాపు 60 రోజులుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top