
ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు చెందిన విలువైన పురాతన వస్తువులను దుండుగులు దోచుకున్నారు.
సాక్షి, హైదరాబాద్ : నిజాం మ్యూజియంలో సోమవారం భారీ చోరీ జరిగింది. పాతబస్తీలోని డబీర్‌పూరాలో గల నిజాం మ్యూజియంలో విలువైన టిఫిన్ బాక్స్‌లు, వజ్రాలున్న కప్ సాసర్‌ను దొంగలు అపహరించారు. అర్థరాత్రి మ్యూజియం వెంటిలేటర్ ధ్వంసం చేసిన దుండుగులు తాడుతో లోపలకి దిగిన చోరీకి పాల్పడ్డారు. పది సీసీ కెమెరాల కన్నుగప్పి దొంగతనం చేశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు చెందిన విలువైన పురాతన వస్తువులను దుండుగులు దోచుకున్నారు. కాగా నిజాంలకు చెందిన విలువైన వస్తువులన్నీ ఈ మ్యూజియంలోనే ఉన్నాయి.
