సత్యవతిపై అధిష్టానం అసంతృప్తి | the high command of discontent on satyavati | Sakshi
Sakshi News home page

సత్యవతిపై అధిష్టానం అసంతృప్తి

Nov 23 2014 3:10 AM | Updated on Mar 18 2019 9:02 PM

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కుంజా సత్యావతి ....

ఖమ్మం : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కుంజా సత్యావతి పనితీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉందని, ఆ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి సమన్వయ కమిటీని వేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ జట్టి కుసుమకుమార్ అన్నారు. శనివారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌కు వ్యతిరేకంగా కుంజా సత్యవతి పనిచేశారని, ఈ విషయంపై బలరాంనాయక్ ఏఐసీసీ నాయకులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా అంతా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉంటే ఆమె మాత్రం పట్టించుకోవడంలేని అన్నారు. ఈ విషయంపై టీపీసీసీలో చర్చిజరుగుతోందని అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో సభ్యత్వ నమోదుకోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామని వివరించారు. తెలంగాణలోని ఇతర జిల్లాల కంటే ఖమ్మం జిల్లా నాయకులే అధికమొత్తంలో సభ్యత్వ నమోదు పుస్తకాలు తీసుకెళ్ళారని అనారు.

 ప్రతీ నియోజకవర్గానికి 30వేలకు తగ్గకుండా సభ్యత్వాలు చేర్పించాలని, మొత్తం మూడులక్షల సభ్యత్వాలను సోనియాగాంధి జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాటికి పూర్తి చేసి ఆమెకు కానుకగా ఇస్తామని అన్నారు. సభ్యత్వ నమోదు, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న కార్యకర్తలకే పార్టీ పదవుల్లో పెద్దపీటవేస్తామని అన్నారు. ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో పార్టీని బలోపేతం చేసి మేయర్ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఇందుకోసం 50 డివిజన్లలో సమన్వయ కమిటీలను వేస్తామని, దీనికి స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కన్వీనర్‌గా ఉంటారని అన్నారు.

ప్రజాప్రతినిధులు తమ సమస్యలను చెప్పుకునేందుకు నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకులను భయాందోళనకు గురి చేసేవిధంగా ముఖ్యమంత్రి మాట్లాడటం సబబుకాదన్నారు. ఆఫరేషన్ బ్లూస్టార్ అంటూ ఎమ్మెల్యేలను భయపెడుతున్నాడని అన్నారు. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను కోర్టుకు ఈడ్చి పదవికి రాజీనామా చేసేలా చేస్తామని చెప్పారు.

 గత ఎన్నికల్లో మూడు స్థానాలు సీపీఐకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని, ఇక ముందు ఎలాంటి పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిని తీరు అభినందనీయం అన్నారు.  ఈ విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, డీసీసీ ఇన్‌చార్జ్‌లు ఐతం సత్యం, శీలంశెట్టి వీరభద్రం, పరుచూరి మురళి, శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకులు వీవీ అప్పారావు, కొత్తా సీతారాములు, మైనార్టీ సెల్ నాయకులు ఫజల్, మహిళాకాంగ్రెస్ ఖమ్మం నగర అధ్యక్షురాలు కొల్లు పద్మ, కట్ల రంగారావు, బాలాజీరావు నాయక్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement