ట్రాన్స్ ఫార్మర్ పై ఫీజ్ వేయడానికి ప్రయత్నించిన రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
ట్రాన్స్ ఫార్మర్ పై ఫీజ్ వేయడానికి ప్రయత్నించిన రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తుంగతూర్తి మండలం బండరామారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాములు(45) అనే వ్యక్తి వ్యవసాయ బావి వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ఫీజ్ వేయడానికి యత్నిస్తుండగా.. ప్రమాద వశాత్తు షాక్ కొట్టింది. దీంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.