జిల్లాలో స్వైన్ ఫ్లూ జాడ కనిపించింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ
ఎంజీఎంలో అనుమానిత కేసు నమోదు
ఎంజీఎం : జిల్లాలో స్వైన్ ఫ్లూ జాడ కనిపించింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో అనుమానిత కేసు నమోదైనట్లు మెడిసిన్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఆర్‌ఎంఓ హేమంత్ తెలిపారు. నర్సంపేటకు చెందిన 28 ఏళ్ల యువకుడు ప్రవీణ్ జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో ఎక్స్‌రే పరీక్షలకు పంపించారు.
న్యూమోనియాగా తేలడంతో స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసుగా పరిగణించి ప్రత్యేక వార్డుకు తరలించారు. మైక్రోబయోలజీ సిబ్బంది స్వైన్‌ప్లూ పరీక్షలకు సంబంధించిన నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ప్రివెంట్ మెడిసిన్‌కు పంపించారు. ఈ నమూనాల ఫలితాలు శనివారం రానున్నట్లు ఆర్‌ఎంఓ తెలిపారు.