ఇసుక అక్రమ రవాణాకు ‘చెక్’ | the check post set up at k.kondaram | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణాకు ‘చెక్’

Sep 29 2014 1:53 AM | Updated on Aug 28 2018 8:41 PM

ప్రధానంగా నర్సింగ్‌భట్ల వాగు నుంచి రోజు సుమారు 70 లారీలు ఈ గ్రామం మీదుగా ఇసుకను రవాణా చేస్తున్నాయి.

ప్రధానంగా నర్సింగ్‌భట్ల వాగు నుంచి రోజు సుమారు 70 లారీలు ఈ గ్రామం మీదుగా ఇసుకను రవాణా చేస్తున్నాయి. దీంతో రూ.3.50 కోట్లతో దోనకల్లు - రాములబండ గ్రామాల మధ్య గత ఏడాది నిర్మించిన బీటీ రోడ్డుకు అక్కడడక్కడ గుంతలు ఏర్పడ్డాయి. బీటీ రోడ్డు నిర్మించక ముందు కంకర తెలడంతో రెండేళ్లు గ్రామస్తులు నరకయాతన అనుభవించారు. ఇకపై బీటీ రోడ్డు ధ్వంసం కాకుండా ఉండేందుకు గ్రామస్తులంతా సమష్టిగా కలిసి సర్పంచ్ కృష్ణవేణి, ఎంపీటీసీ మల్లేష్‌ల సహకారంతో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు.

 ఎస్పీకి ఫిర్యాదు చేస్తే..
 రెండు నెలల క్రితం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ జిల్లా ఎస్పీని కలిసి గ్రామం నుంచి ఇసుక లారీలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నిరంతరాయంగా ఇసుక లారీలు వెళ్లడంతో రోడ్డు ధ్వంసమవుతుందని ఫిర్యాదు చేశారు. గ్రామస్తులే చైతన్యవంతులై ఇసుక లారీలు వెళ్లకుండా అడ్డుకోవాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారికి సూచించారు.

 నిరంతరం కాపలా..
 చెక్‌పోస్టు వద్ద నిరంతరం సర్పంచ్ కుటుం బ సభ్యులు కాపలా ఉంటున్నారు. కేవలం ట్రాక్టర్లు వెళ్లే ఎత్తులోనే చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. లారీలు వస్తే అక్కడే ఆగిపోవాల్సిందే. ఇతర ధాన్యం లారీలు, గడ్డి ట్రాక్టర్లు వస్తే వెంటనే చెక్‌పోస్టుపై ఉన్న ఇనుప రాడ్డును పైకి లెపేస్తారు. చెక్‌పోస్టుపై సెల్ నంబర్ వేశారు. అత్యవసర పరిస్థితిలో సర్పంచ్ కుటుంబ సభ్యులు చెక్‌పోస్టు వద్ద లేకపోతే ఫోన్‌లో సమాచారం అందిస్తారు. ఆ సమాచారంతో రోడ్డు క్లియరెన్స్ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement