నిర్మల్‌లో దారుణహత్య | the brutal murder done in Nirmal | Sakshi
Sakshi News home page

నిర్మల్‌లో దారుణహత్య

Jul 21 2014 2:05 AM | Updated on Sep 2 2017 10:36 AM

నిర్మల్‌లో దారుణహత్య

నిర్మల్‌లో దారుణహత్య

ఉపాధి నిమిత్తం వలస వచ్చిన మహారాష్ట్రవాసిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్యచేశారు. ఈ సంఘటన నిర్మల్ పట్టణంలోని బైల్‌బజార్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి జరిగింది.

నిర్మల్ అర్బన్ : ఉపాధి నిమిత్తం వలస వచ్చిన మహారాష్ట్రవాసిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత్యచేశారు. ఈ సంఘటన నిర్మల్ పట్టణంలోని బైల్‌బజార్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సీహెచ్.సురేశ్(40) నిర్మల్‌లోని బైల్‌బజార్ సమీపంలో గుడిసె వేసుకొని కొన్నేళ్లుగా కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కమ్మరి వృత్తి చే స్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
 
రోజూ మా దిరిగానే శనివారంరాత్రి తన గుడిసెలో కు టుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. అనూహ్యరీతిలో అర్ధరాత్రి గుడిసె సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద సురేశ్ దారుణ హ త్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతడి గొంతు కోసి చంపారు. ఆదివారం ఉద యం పనికి వచ్చిన మేస్త్రీ భవనం వద్ద ఉన్న గొయ్యిలో మృతదేహాన్ని గమనించి ఇంటి య జమానికి, పోలీసులకు సమాచారం అందించాడు. పట్టణ సీఐ ప్రశాంత్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆదిలాబాద్ నుంచి క్లూస్‌టీంను రప్పించి, జాగిలంతో గాలించా రు.
 
అర్ధరాత్రి మూత్ర విసర్జన కోసమని బయటకు వెళ్లిన సురేశ్ తిరిగి రాలేదని అతడి భార్య చంద్రకళ పేర్కొంది. అయితే సంఘటన స్థలంలో, మృతదేహంపై రక్తపు మరకలు లేకపోవడం, మృతదేహం పక్కనే నిమ్మకాయలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ ఉండడం అనుమానాలకు తావిస్తోంది. సంఘటన స్థలంలోనే హత్య చేశారా? లేక మరెక్కడైనా చంపి ఇక్కడ మృతదేహం పడేశారా అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, గుర్తు తెలియని వ్యక్తులు సురేశ్ గొంతు కోసి హత్య చేసినట్లు సీఐ తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని, విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. సురేశ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement