
అధికారికంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించారు.
హైదరాబాద్ : ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. సెప్టెంబర్ 27 న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి రోజున అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఆయన జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ నుంచి 8 లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.