రాష్ట్రంలో ఓటర్లు 2.73కోట్లు

Telangana Election Comission Prepared Final Voter List - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగ నున్న శాసనసభ ఎన్నికల్లో 2.73 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర శాసనసభ రద్దయిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఓటర్ల జాబితా రెండో సవ రణ కార్యక్రమం అనంతరం.. తుది జాబితాను శుక్రవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యా లయం ప్రకటించింది. ముసాయిదా జాబితాలో మొత్తం 2.61 కోట్ల మంది ఓటర్లు ఉండగా, తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.73 కోట్లకు పెరిగింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగనుంది. ఈ ఎన్నికల నామినే షన్లకు రెండ్రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఓటర్ల జాబితా ఇలా..
పురుషులు    :    1,37,87,920
స్త్రీలు            :    1,35,28,020
థర్డ్‌ జెండర్‌    :    2,663
మొత్తం         :    2,73,18,603
సర్వీస్‌ ఓటర్లు :    9,451 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top