తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్ హౌసింగ్ సొసైటీల్లో అవకతవకలపై చర్చించే అవకాశం ఉంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్ హౌసింగ్ సొసైటీల్లో అవకతవకలపై చర్చించే అవకాశం ఉంది. ఈ విషయమై టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.
రేపు ద్రవ్యవినిమయ బిల్లును సభలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ చివరి రెండు రోజులు కచ్చితంగా సభకు హాజరుకావాలని సభ్యులను టీఆర్ఎస్ ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం.