ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ త్వరలో ఖరారు కానున్నాయి.
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ త్వరలో ఖరారు కానున్నాయి. దీనిపై విద్యాశాఖ నియమించిన అధికారుల కమిటీ మూడు రోజులుగా సమావేశమై చర్చిస్తోంది. శుక్రవారం ఏకీకృత సర్వీసు రూల్స్‌లో ఏయే అంశాలుండాలన్న విషయమై చాలాసేపు చర్చించింది.
మున్ముందు న్యాయపర సమస్యలు రాకుం డా ఉండాలంటే పంచాయతీరాజ్ టీచర్ల (మండల పరిషత్, జిల్లా పరిషత్) కేడర్‌ను స్టేట్ లోకల్ కేడర్‌గా ఆర్గనైజ్ చేయడమే ప్రధానమన్న అంశంపై చర్చించారు. ప్రతిపాదనలు పూర్తయిన వెంటనే నివేదికను ప్రభుత్వానికి పంపనున్నారు.