ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ముందు లారీ ఢీకొని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు.
లారీ ఢీకొని ఉపాధ్యాయుడు మృతి
Jan 22 2016 11:49 AM | Updated on Sep 27 2018 5:29 PM
	ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ముందు లారీ ఢీకొని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. జైనత్ మండలంలో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసే బాబూలాల్ రాథోడ్ (35)... శుక్రవారం ఉదయం న్యూ హౌసింగ్‌బోర్డు కాలనీలోని తన నివాసం నుంచి విధులకు హాజరయ్యేందుకు బైక్‌పై వెళ్తున్నాడు. రిమ్స్ ముందు ఆయన బైక్‌ను వెనుక నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన రాథోడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
