బంగారు తెలంగాణ దేవుడెరుగు... మట్టి తెలంగాణను మిగిలిస్తే అంతే చాలని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ ముఖ్యమంత్రికి హితవు పలికారు
గవర్నర్‌కు టీటీడీపీ నేతల వినతి
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ దేవుడెరుగు... మట్టి తెలంగాణను మిగిలిస్తే అంతే చాలని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ ముఖ్యమంత్రికి హితవు పలికారు. ఛాతీ ఆస్పత్రి, సచివాలయాలను యథాస్థితిలో కొనసాగించేలా, కోర్టు ఉత్తర్వులకు లోబడి జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించేలా సీఎంపై ఒత్తిడి తేవాలని కోరుతూ టీడీపీ నాయకులు మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎల్.రమణ మీడియాతో మాట్లాడుతూ వాస్తు పేరుతో సచి వాలయాన్ని ఎర్రగడ్డకు తరలించి సచివాలయమున్న ప్రాంతంలో తన అనుచరులతో ఫైవ్‌స్టార్ హోటల్ కట్టుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. విలువైన ప్రభుత్వస్థలాలను, భవనాలను అమ్మి ఆర్థిక లోటు పూడ్చుకోవాలనుకుంటున్న అసమర్థ సీఎంకేసీఆర్ అని ధ్వజమెత్తారు. కాగా, దళితులకు రాష్ట్ర కేబినెట్‌లో స్థానం లేకపోవడం విచారకరమని, ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు నేతృత్వంలోని ఓ బృందం గవర్నర్ నరసింహన్‌ను కలసి విజ్ఞప్తి చేసింది.