సివిల్స్‌కు జిల్లావాసి ఎంపిక | tarun reddy got 488 rank in civils exams | Sakshi
Sakshi News home page

సివిల్స్‌కు జిల్లావాసి ఎంపిక

Jun 14 2014 4:32 AM | Updated on Jul 11 2019 6:33 PM

సివిల్స్‌కు జిల్లావాసి ఎంపిక - Sakshi

సివిల్స్‌కు జిల్లావాసి ఎంపిక

పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన గంగిరెడ్డి తరుణ్‌రెడ్డి మొదటి ప్రయత్నంలోనే 488వ ర్యాంక్ సాధించి సివిల్స్- 2013కు ఎంపికయ్యారు.

 పాల్వంచ రూరల్ :  పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన గంగిరెడ్డి తరుణ్‌రెడ్డి మొదటి ప్రయత్నంలోనే 488వ ర్యాంక్ సాధించి సివిల్స్- 2013కు ఎంపికయ్యారు. గంగిరెడ్డి రామనుజారెడ్డి-వాణి దంపుతుల కుమారుడైన తరుణ్‌రెడ్డి పాల్వంచలో ప్రాథమిక విద్యనభ్యసించాడు.

అనంతరం రామానుజరెడ్డి హన్మకొండ న్యాయస్థానంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బదిలీ కావడంతో కాజీపేటలో బీటెక్, న్యూజిలాండ్‌లో ఎంబీఏ పూర్తిచేసి సివిల్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగావకాశాలు వచ్చినా.. వాటిలో చేరకుండా ఐఏఎస్సే లక్ష్యంగా చదివాడని, తమ కుమారుడు అనుకున్న గోల్ సాధించడం ఆనందంగా ఉందని తండ్రి రామనుజారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.తరుణ్ రెడ్డి స్వగ్రామం పాండురంగాపురంలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
 
ప్రజాసేవే లక్ష్యం... : ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని, అందుకోసం ఎంత కష్టాన్నైనా భరిస్తానని తరుణ్‌రెడ్డి చెప్పారు. రోజుకు 6 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి అనేక కష్టాల మధ్య చదువుకున్న తండ్రి స్ఫూర్తితో చదివానని పేర్కొన్నారు. ఐఎఎస్ సాధించాలనే పట్టుదల చిన్ననాటి నుంచే ఉందని, తొలి ప్రయత్నంలోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అనందగా ఉందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement