నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలోని గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ ముందు చెరకు రైతులు బుధవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు.
సదాశివనగర్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలోని గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ ముందు చెరకు రైతులు బుధవారం మధ్యాహ్నం ఆందోళనకు దిగారు. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన బిల్లులు రూ.50 కోట్లను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం ఖాతాల్లో ఇంకా బిల్లులు జమ చేయలేదని, వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. కాగా, బకాయిల చెల్లింపులకు 15 రోజుల సమయం కావాలని షుగర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం కోరినట్టు సమాచారం.