సెల్ చార్జింగ్ పెడుతూ.. | Student killed with electric shock | Sakshi
Sakshi News home page

సెల్ చార్జింగ్ పెడుతూ..

Nov 2 2015 9:17 AM | Updated on Nov 9 2018 5:02 PM

సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతూ.. ప్రమాద వశాత్తు ఓ విద్యార్థి మరణించాడు.

సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ ప్రమాద వశాత్తూ విద్యుదాఘాతానికి  గురై యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం బాలెం తండలో సోమవారం ఉదయం జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన సబావత్ మోహన్(18) ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం తన మొబైల్‌లో చార్జింగ్ తక్కువగా ఉండటంతో.. చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తుండగా.. విద్యుధ్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement